Caste Census in Telangana | కులగణన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
Caste Census in Telangana | కులగణన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
నవంబర్ 2 డీసీసీ అధ్యక్షులు సమావేశాలు
వెల్లడించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
Hyderabad : రాష్ట్రంలో కుల గణన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలి సూచించారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, సలహాదారు కే కేశవరావుతో కలిసి బీసి కులగణన పై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ కులాణననపై స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే కులగణన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణననపై సాహసోపేత కార్యక్రమాలు తీస్కున్నారని అభిప్రాయపడ్డారు. దీనికి పార్టీ సంపూర్ణంగా అండగా నిలబడి కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నవంబర్ 2న 33 జిల్లాలో కులగణనపై డీసీసీ అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్దఎత్తున ప్రజల్లోకి తీస్కెళ్లాలని చెప్పారు. ముఖ్యంగా విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల ఘనన పై ఎలాంటి అనుమానాలు ఉన్న గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని టీపీసీసీ స్పష్టం చేశారు.
* * *
Leave A Comment